Вход на сайт

Просмотр новости

Найдите то, что Вас интересует

‘ఫుడ్ జిహాద్’ పేరుతో వైరల్ అవుతున్న ఈ వీడియో నిజమైన ఘటన కాదు, ఇదొక స్క్రిప్టెడ్ వీడియో

Дата публикации: 16-10-2026 09:25:22

చెరకు రసంలో హానికరమైన పదార్థం కలిపి అమ్ముతున్నాడంటూ వీధి వ్యాపారిపై ఒక వ్యక్తి దాడి చేస్తున్న వీడియో (ఇక్కడ & ఇక్కడ) ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనను ‘ఫుడ్ జిహాద్’గా పేర్కొంటూ, బయట ఆహార పదార్థాలు కొనేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తూ దీనిని షేర్ చేస్తున్నారు. ఇందులో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం. క్లెయిమ్: చెరకు రసంలో హానికరమైన పదార్థాన్ని కలుపుతున్న ముస్లిం వ్యాపారిపై కస్టమర్ దాడి చేస్తున్న దృశ్యాలు. ఫాక్ట్: ఈ [...]
The post ‘ఫుడ్ జిహాద్’ పేరుతో వైరల్ అవుతున్న ఈ వీడియో నిజమైన ఘటన కాదు, ఇదొక స్క్రిప్టెడ్ వీడియో appeared first on FACTLY.


Основное содержимое страницы с новостью.

చెరకు రసంలో హానికరమైన పదార్థం కలిపి అమ్ముతున్నాడంటూ వీధి వ్యాపారిపై ఒక వ్యక్తి దాడి చేస్తున్న వీడియో (ఇక్కడ & ఇక్కడ) ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనను ‘ఫుడ్ జిహాద్’గా పేర్కొంటూ, బయట ఆహార పదార్థాలు కొనేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తూ దీనిని షేర్ చేస్తున్నారు. ఇందులో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

ఆర్కైవ్ పోస్టుని ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: చెరకు రసంలో హానికరమైన పదార్థాన్ని కలుపుతున్న ముస్లిం వ్యాపారిపై కస్టమర్ దాడి చేస్తున్న దృశ్యాలు.

ఫాక్ట్: ఈ వీడియోలోని ఘటన నిజం కాదు. ఇది కేవలం సామాజిక అవగాహన కోసం బంగ్లాదేశ్‌కు చెందిన మొహమ్మద్ రుహుల్ రూపొందించిన ఒక స్క్రిప్టెడ్ వీడియో మాత్రమే. కావున, పోస్టులో చేయబడిన క్లెయిమ్ తప్పు.

ముందుగా, ఈ వైరల్ వీడియోలోని దృశ్యాలను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, దీనికి సంబంధించిన అసలు వీడియోను (ఆర్కైవ్) “Ruhul vlog” అనే బంగ్లాదేశీ ఫేస్‌బుక్ పేజీలో 24 సెప్టెంబర్ 2026న అప్‌లోడ్ చేసినట్లు గుర్తించాం. ఈ పేజీలో మొహమ్మద్ రుహుల్ అనే వ్యక్తి సామాజిక అవగాహన, వినోదం కోసం ఇలాంటి వివిధ స్క్రిప్టెడ్ వీడియోలను రూపొందిస్తుంటారని తెలిసింది.

ఇక వైరల్ వీడియోను పరిశీలించగా, ఒక వీధి వ్యాపారి చెరుకు రసంలో స్యాకరిన్ (Saccharin) అనే కృత్రిమ స్వీట్నర్ (Artifical Sweetener) కలిపి ప్రజలను అనారోగ్యానికి గురి చేస్తున్నాడంటూ మొహమ్మద్ రుహుల్ అతనితో వాగ్వాదానికి దిగి దాడికి పాల్పడతాడు. అయితే, వీడియో చివర్లో రుహుల్ మాట్లాడుతూ, ఇది కేవలం అవగాహన కోసం తీసిన స్క్రిప్టెడ్ వీడియో అని, తాము సామాజిక అంశాలపై ఇలాంటి వీడియోలు చిత్రీకరిస్తామని స్పష్టం చేశాడు. దీన్ని బట్టి, వైరల్ అవుతున్న వీడియో నిజమైన ఘటన కాదని, కేవలం అవగాహన కోసం తీసిన స్క్రిప్టెడ్ వీడియో అని స్పష్టమవుతుంది.

అయితే, ఆహార పదార్థాలు, పానీయాల్లో స్యాకరిన్ వాడకంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఆరోగ్యంపై దీని ప్రభావం గురించి మరిన్ని అధ్యయనాలు జరగాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. FSSAI దీనిని పరిమిత మోతాదులో మాత్రమే వాడటానికి అనుమతిస్తుంది. అయినప్పటికీ, భారత్, బంగ్లాదేశ్ వంటి దేశాల్లో ఎలాంటి నాణ్యతా పరీక్షలు లేకుండా, పరిమితికి మించి దీనిని పానీయాలు, ఆహార పదార్థాల్లో వాడుతున్నట్లు పలు మీడియా కథనాలు (ఇక్కడ & ఇక్కడ) పేర్కొన్నాయి.

చివరిగా, ఫుడ్ జిహాద్ పేరుతో వైరల్ అవుతున్న ఈ వీడియో నిజమైన ఘటన కాదు, ఇది బంగ్లాదేశ్‌లో రూపొందించిన ఒక స్క్రిప్టెడ్ వీడియో.

Схожие новости

#Наименование новостиТональностьИнформативностьДата публикации
1The viral video shows Tejashwi Yadav’s August 2026 protest march in Patna, not CJP’s Tiranga March in Delhi07.4817-10-2026
2Гонявшийся с ножом за коллегой в российском строительном гипермаркете попал на видео0506-07-2026
3Ограбление российского магазина попало на видео01024-08-2026
4This video does not show the Indian flag being burnt and damaged on a road in Iran; it was filmed in Karachi, Pakistan0706-07-2026
5В Москве мужчина напал на журналистов0018-03-2025
6МВД проверяет информацию о массовой драке курьеров "Яндекс.Еды" и Delivery Club в Москве0002-07-2020
7В СЖР назвали неприемлемым нападение на фотографа "Коммерсанта" в Москве0004-11-2020
8Голодный ковбой совершил налет на московский магазин и попал на видео08.2625-09-2026
9Джигана атаковали в соцсетях после сообщений об устроенной им стрельбе и взятии заложников01023-09-2026

Классификация: . Схожих патентов: 0. Схожих новостей: 9. Тональность: 0. Информативность: 7.2. Источник: factly.in.